బిగ్‌బాస్3: ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కలిసిరానట్టేనా..!

Sunday, September 15th, 2019, 09:39:20 PM IST

బిగ్‌బాస్ సీజన్3 గత రెండు సీజన్ల కన్నా రసవత్తరంగానే సాగుతుందని చెప్పాలి. హౌస్‌లో ఉన్న సభ్యుల మధ్య గొడవలు, ప్రేమయానం, టాస్క్‌లు ఇలా రకరకాల సన్నివేశాలతో షో ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచింది. అయితే ఇప్పటీకే మూడో సీజన్ ఆరు వారాలు కంప్లీట్ చేసుకుని ఏడో వారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

అయితే తొలి ఆరు వారాలలో హేమ‌, జాఫ‌ర్‌, త‌మ‌న్నా సింహాద్రి, రోహిణి, ఆషు రెడ్డి, అలీ రెజా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారానికి సంబంధించి నేడు మరో ఎలిమినేషన్ జరగబోతుంది. అయితే ఈ వారానికి సంబంధించి ఈ సీజన్‌లో రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ కావడం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తుంది. అయితే మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ట్రాన్స్ జెండర్ తమన్నా కూడా ఎక్కువ రోజులు హౌస్‌లో లేకపోవడం, వచ్చిన ఒక వారానికే శిల్పా కూడా ఎలిమినేట్ అవుతుండడం చూస్తుంటే ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పెద్దగా షోకి ఉపయోగపడలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకున్న ఇద్దరి ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం, వారిద్దరి ఎంట్రీ వలన కూడా షో రేటింగ్ పెద్దగా పెరగకపోవడంతోనే వారు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారని, ఏదేమైనా వలీడ్ కార్డ్ ఎంట్రీ ఈ సీజన్‌కు కలిసిరాలేదన్న వాదనలు బిగ్‌బాస్ ప్రేక్షకుల నుంచి వినిపిస్తుండడం గమనార్హం.