“బిగ్ బాస్” లో బాబా భాస్కర్ మాస్టర్ పై ప్లాన్డ్ కుట్ర జరుగుతుందా.?

Sunday, August 25th, 2019, 09:34:16 PM IST

మొదటి రెండు సీజన్ల కంటే కూడా ఈసారి మొదలైన బిగ్ బాస్ మూడవ సీజన్ ను తెలుగు ప్రేక్షకులు మరింత ఆసక్తికరంగా చూస్తున్నారని చెప్పాలి.మొదటి రెండు సీజన్ల కంటే ఈ సీజన్లో కాస్త ఎక్కువ తెలిసిన వారిని తీసుకోవడం వల్ల ఈసారి వీక్షకుల సంఖ్య కూడా పెరిగింది.కానీ ఈ సీజన్లో మాత్రం గత రెండు వారాల నుంచి గమనించినట్టయతే ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ అందించే బాబా భాస్కర్ మాస్టర్ ను మాత్రమే కార్నర్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారా అన్న భావన తప్పక కలుగుతుంది.అలీ బాబాను ఎప్పుడైతే నామినేట్ చేసినప్పుడు నుంచి ఈ సరికొత్త రచ్చ మొదలయ్యింది.

నాగార్జున కూడా బాబాను మాత్రమే ఏదొకలా టార్గెట్ చేస్తూ ఒక పెద్ద మనిషిగా ఎందుకు ఎవరు గొడవ పడుతున్నా సరే ఆపడం లేదని అంటున్నారు.బాబా గొడవలు ఆపేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కావాలనే నెగిటివ్ చేసినట్టు నాగ్ మాట్లాడారు.అలాగే మహేష్ మరియు అలీ మధ్యలో బాబా కోసమే గొడవ జరుగుతున్నపుడు కూడా బాబా ఎందుకు కలుగజేసుకోలేదని మిగతా హౌస్ మేట్స్ తో ఒకలా మాట్లాడుతూ ఒక్క బాబా విషయంలో మాత్రం ఈ పక్షపాతం ఎందుకు చూపిస్తున్నారని ఈ షోను గమనిస్తున్న వీక్షకులు అంటున్నారు.