మన దగ్గర “కేజీయఫ్” పై డౌటేనట..!?

Sunday, July 5th, 2020, 07:55:04 PM IST

బాహుబలి సిరీస్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో దేశం మొత్తం హాట్ టాపిక్ కాబడిన మన దక్షిణాది సినిమా ఏదన్నా ఉంది అంటే అది “కేజీయఫ్ చాప్టర్ 1” అని చెప్పాలి. కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

దీనితో పాటుగా డిజిటల్ ప్లాట్ ఫాం లో కూడా భారీ హిట్ కాబడిన ఈ చిత్రం మాత్రం టెలివిజన్ తెరపై రావడానికి చాలా సమయాన్నే తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ కోసం ఎంత గానో ఎదురు చూసారు. అయితే ఇన్నాళ్లకు ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం స్టార్ మా ఛానెల్లో ఈరోజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయనున్నారు.

అయితే ఈ చిత్రం ప్రమోషన్ మాత్రం మాములుగా చేయలేదని చెప్పాలి. సినిమా విడుదల టైం లో మన తెలుగు ఆడియన్స్ కు ఎంతలా చేరువ కావాలని ప్రయత్నించారో అంతే స్థాయిలో టెలివిజన్ ప్రీమియర్ కోసం కూడా ప్రమోట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఇంత చేస్తున్నా స్మాల్ స్క్రీన్ పై ఈ చిత్రం హిట్ అయ్యేందుకు మాత్రం అవకాశాలు తక్కువే ఉన్నాయని చెప్పాలి.

ఎందుకంటే ఇప్పటికే చాలా మంది చాలా సార్లే ఈ చిత్రాన్ని మొబైల్స్ మరియు డిజిటల్ గా అరగదీసేసారు. అందుకే ఈసారి స్మాల్ స్క్రీన్ పై అంత ఆసక్తి చూపట్లేనట్టు తెలుస్తుంది. అందుకే ఈ చిత్రం టీఆర్పీ రేటింగ్ పై కాస్త డౌట్ గానే ఉందని చెప్పాలి. మరి ఈ సినిమాను మన వాళ్ళు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.