అదిరిపోయే స్టెప్స్‌తో అలరించిన ఢీ జోడీ..!

Friday, June 14th, 2019, 12:22:13 AM IST

దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో ఢీ. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ ప్రోగ్రాం అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న శేఖర్ మాస్టర్ కూడా ఈ వేదిక నుంచే పరిచయమయ్యాడు. ఇప్పుడు ఇదే ప్రోగ్రాంలో న్యాయ నిర్ధేతగా కూడా పనిచేస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రోగ్రాం 10 సీజన్స్‌ని విజయవంతంగా పూర్తి చేసుకుని 11వ సీజన్ ఢీ జోడి ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ ప్రోగ్రాంకు ప్రదీప్ యాంకర్‌గా, రష్మి, సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్స్‌గా, హీరోయిన్ ప్రియమణి, శేఖర్ మాష్టర్ లు జడ్జెస్‌గా నిర్వహిస్తుంటారు. అయితే ఈ ప్రోగ్రాంలో అదిరిపోయే స్టెప్పులు, అబ్బురపరిచే డ్యాన్స్‌లతో ఒక్కొక్క కంటెస్టెంట్ చేస్తున్న విన్యాసాలు చూస్తే అప్పుడప్పుడు ప్రేక్షకుల గుండెల్లోనే కాదు వారి వళ్లులో కూడా వణుకు పుట్టిస్తుంటాయి. అలాంటి వణుకు పుట్టించే స్టెప్పులతో స్టేజ్‌పై నీనటి ఢీ జోడీ ఎపిసోడ్‌లో శషాంక్, గరిమ అదరగొట్టారు. వీరికి ఢీ 10 టైటిల్ విన్నర్ యశ్వంత్ మాస్టర్ తోడైతే ఇక డ్యాన్స్ ఎలా ఉంటుందో ఇక చెప్పనక్కర్లేదు. ప్రాణం ఉన్నప్పుడు ప్రేమ లేదు, ప్రేమ ఉన్నప్పుడు ప్రాణం లేదు అనే కాన్సెప్ట్‌కి ఈ ముగ్గురు కలిసి డ్యాన్స్ చేశారు. వీరి స్టెప్స్, యాక్షన్ చూస్తున్నంత సేపు అందరు కన్నార్పకుండా చూసారంటే వీరి పెర్ఫార్మెన్స్ ఏ రేంజులో ఉందో అర్ధమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కింద ఉన్న లింక్‌ని క్లిక్ చేసి ఆ వీడియోను చూసేసెయండి.