“జీతెలుగు” సరికొత్త షోకు అప్పుడే విపరీతమైన నెగిటివిటి.!

Tuesday, December 10th, 2019, 10:41:01 AM IST

తెలుగులో ఉన్నటువంటి ఎన్నో టాప్ మోస్ట్ ఛానెల్స్ లో ఎన్నో అదిరిపోయే ప్రోగ్రామ్స్ ఉన్నాయి.అలా ఒక్కో ఛానెల్ ఒక్కో యూనిక్ షోను ప్లాన్ చేసుకుంటున్నారు.అలా ఇప్పుడు జీతెలుగు ఛానల్ వారు ఒక సరికొత్త షోను ప్లాన్ చేసుకుంటున్నారు.దానికి సంబంధించిన ప్రోమోను కూడా తాజాగా యూట్యూబ్ లో కూడా పెట్టారు.టవర్ స్టార్ నాగబాబు ను ఎలివేట్ చేస్తూ అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేసిన ఈ ప్రోగ్రాం కు వీరు “అదిరింది” అని పేరు పెట్టారు.వ్యూస్ పరంగా రెస్పాన్స్ కూడా బాగానే ఉంది.కాకపోతే నెగిటివిటీ కూడా కాస్త ఎక్కువ స్థాయిలోనే ఉందని చెప్పాలి.

ఎందుకంటే చాలా మంది ఈ ప్రోమో చూసి యూట్యూబ్ లో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ నే ఇచ్చారు.ముఖ్యంగా అయితే ఈ షోను యూట్యూబ్ లో కానీ పెట్టకపోతే ఎక్కువ మందికి రీచ్ అవ్వదని చెప్పకనే చెప్పేస్తున్నారు.జీతెలుగు వారు వారి షోలను సీరియల్స్ న తమ జీ5 యాప్ లో స్ట్రీమింగ్ కు మాత్రమే అందుబాటులో ఉంచుతారు.ఇప్పుడు అదే పెద్ద మైనస్ గా మారింది.దీనితో మేము అయితే జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకోమని యూట్యూబ్ లో పెడితే తప్ప టైటిల్ లో అదిరింది అని పెట్టుకున్నంత మాత్రాన అదరదని తేల్చి చెప్పేస్తున్నారు.ఇలా కామెంట్ చేసిన వారికి ఇతరుల నుంచి కూడా అదే మాట వినిపిస్తున్నారు.యూట్యూబ్ లో పెడితే తప్ప ఈ షో సర్వైవ్ అవ్వడం కష్టమే అని చెప్పాలి.