కదిలిన జనసేన.. పవన్ కోసం ఎదురుచూపులు!

Wednesday, March 14th, 2018, 06:18:09 PM IST

జనసేన అసలైన రాజకీయ ఆలోచన ఏమిటో ఈ రోజే తెలియనుంది. జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా పవన్ కళ్యాణ్ తన తదుపరి కార్యాచరణ గురించి వివరంగా తెలుపనున్నాడు. అందుకోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ సమీపాన ఉన్న 30 ఎకరాల స్థలంలో సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పవన్ అభిమానులు భారీగా తరలివచ్చారు. వారిని అదుపుచేయడం అసాధారణంగా మారింది.

కొంత మంది దూకుడు కారణంగా తొక్కిసలాట జరగడంతో గాయపడిన వారిని జనసేన నిర్వాహకులు ఆస్పత్రికి తరలించారు. అయితే జనసేన నిర్వాహకులు అభిమానులను క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొంత మంది అభిమానులు కూడా సభ సక్రమంగా జరగడానికి సహాయాన్ని చేస్తున్నారు. పవన్ రాకముందే ఈ తరహాలో ఉంటే వచ్చాకా పరిస్థితి అదుపులో ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. మరికొద్ది సేపట్లో పవన్ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.