‘3’డైరెక్టర్ తో డా. రాజశేఖర్.. ఏంటి సంగతీ..!

Monday, April 30th, 2018, 07:12:08 PM IST

పీఎస్‌వీ గరుడ వేగ సినిమాతో మంచి హిట్ కొట్టాడు టాలీవుడ్ యాక్టర్ రాజశేఖర్. ఈ సినిమా విజయంతో సంతోషంగా ఉన్న రాజశేఖర్ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టిపెట్టాడు. ‘అ’ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఇప్పటికే ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. తాజాగా రాజశేఖర్ కొత్త సినిమాకు సంబంధించిన మరో న్యూస్ ఒకటి కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నది.

‘3’ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యాధనుష్ తన కొత్త సినిమాను రాజశేఖర్‌తో చేయాలని ఫిక్స్ అయ్యారట. ఐశ్వర్యా ధనుష్ ఇటీవలే రాజశేఖర్‌ను కలిసి స్టోరీ లైన్ చెప్పగా..దీనికి రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని టాక్ నడుస్తోంది. రెండు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ కీలకపాత్రల్లో నటించనున్నారట. మరీ రాజశేఖర్ తొలుత ఏ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తారో చూడాలి మరి.

  •  
  •  
  •  
  •  

Comments