ఆ మల్టీస్టారర్ లో అనసూయకు బంపర్ ఆఫర్?

Tuesday, April 24th, 2018, 04:54:38 PM IST


జబర్దస్ షో తో మంచి పేరు సంపాదించిన బుల్లితెర నటి అనసూయ. అయితే ఆ షో తర్వాత ఆమెకు మంచి పేరు రావడంతో ఆమె అక్కడక్కడా సినిమాల్లో అడపాదడపా మంచి క్యారెక్టర్ లు చేస్తున్నారు. కాగా క్షణం చిత్రంలో ఆమె విలన్ గ చేసిన పాత్రకు మంచి పేరు దక్కింది. అలానే ఇటీవల విడుదలయి సూపర్ హిట్ అయిన రాంచరణ్ రంగస్థలంలో రంగమ్మ అత్త పాత్రలో అనసూయ నటనను ప్రతి ఒక్కరు తెగ మెచ్చుకుంటున్నారు. నిజాంగా ఆ పాత్రలో ఎంతగానో ఒదిగిపోయి నటించింది అనసూయ. ఆ చిత్రం సూపర్ హిట్ కావడం తో ఆమెకు ఆఫర్లు కూడా వెల్లువలా వస్తున్నాయట. అయితే ఆమె ఏవి పడితే అవి ఒప్పుకోవడం లేదని, పాత్ర యొక్క ఔనిత్త్యం బాగుంటేనే ఒప్పుకుంటోందట.

అయితే ఆలా ఆమెకు ఇటీవల రాజా ది గ్రేట్ తో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి త్వరలో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ తో తెరకెక్కించనున్న ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్)లో మంచి పాత్ర చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల దర్శకుడు ఆమెను కలిసారని, పాత్ర బాగుండడంతో అనసూయ కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిలిం నగర్ టాక్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఒకవేళ ఈ వార్త కనుక నిజం అయితే అనసూయ మంచి ఛాన్స్ కొట్టేసినట్లే మరి……

  •  
  •  
  •  
  •  

Comments