మెగాస్టార్ కాంపౌండ్ అఫిషియ‌ల్.. టాలీవుడ్ వెండితెర పైకి మ‌రో హీరో ఎంట్రీ..!

Saturday, October 27th, 2018, 10:11:48 AM IST

టాలీవుడ్‌లో మ‌రో వార‌సులు ఎంట్రీ ఇస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కాంపౌండ్ నుండి ఇప్ప‌టికే ప‌లువురు హీరోలు వెండితెర పై ఎంట్రీ ఇవ్వ‌గా మ‌రో మెగా వార‌సుడు వెండితెర పై ప‌రిచ‌యం అవ‌నున్నారు. మెగా మేన‌ళ్ళుడు సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ కూడా సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షంచుకోవ‌డానికి సిద్ధ‌మ‌వ‌తున్నాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ మెగామేన‌ళ్ళుడిని ప‌రిచ‌యం చేసే బాధ్య‌త త‌న పై వేసుకుంది.

ఈ నేప‌ధ్యంలో తొలిచిత్ర‌మే మంచి నిర్మాణ సంస్థ నుండి అవ‌కాశం రావ‌డం వైష్ణ‌వ్ తేజ్ అదృష్ట‌మ‌నే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ వ‌ద్ద ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నాడు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిచ‌నుండ‌గా హీరోయిన్ మాత్రం ఇంకా సెట్ కాలేద‌ని సమాచారం. దీంతో ఈ చిత్రం సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందో మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. ఏది ఏమైనా మెగా కాంపౌండ్ నుండి ఇప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో హీరోలు వెండితెర ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అవ్వ‌గా.. మ‌రి వైష్ణ‌వ్ తేజ్ ఫ్యూచ‌ర ఎలా ఉంటుందో చూడాల‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments