ధోని సేన వైజాగ్ లోనే ఉంటుందా?

Thursday, April 12th, 2018, 08:52:33 AM IST

రెండేళ్ల నిషేధం తరువాత తిరిగి ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ అప్పటిలానే మంచి విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన రెండు మ్యాచ్ లలో గెలిచి అభిమానులను ఎంతో ఆనందాన్నీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ధోని సేన చెన్నై లో ఆడటం కష్టమే అని తెలుస్తోంది. విశాఖపట్నం లేదా త్రివేండ్రం, పుణె, రాజ్‌ కోట్‌ వంటి స్థావరాల్లో చెన్నై కి ఆతిధ్యం ఇవ్వడానికి స్టేడియంలు సిద్ధంగా ఉన్నాయని బిసిసిఐ తెలిపింది. ప్రస్తుతం తమిళనాడులో కావేరి నది జలాల వివాదం ఉదృత స్థాయికి చేరింది. ఐపీఎల్ ని అడ్డుకుంటామని సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

చెన్నైలో మొన్న జరిగిన మ్యాచ్ కు పోలీసుల బందోబస్తు లేకపోతె ఆందోళన తీవ్ర స్థాయిలో అటపై ప్రభావం చూపేది. అయితే పరిస్థితులు ఇప్పటిలో అదుపులోకి వచ్చే అవకాశం లేదని ఐపీఎల్ యాజమాన్యం టీమ్ హోమ్ టౌన్ ను మార్చాలని ప్లాన్ చేస్తోంది. అయితే ధోని సేన ఇచ్చిన నాలుగు స్టేడియంల ఆప్షన్స్ లలో వైజాగ్ వైపు మొగ్గు చూపుతోందని సమాచారం. చెన్నై జట్టు యాజమాన్యం ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. మ్యాచ్ లకు అంతరాయం కలుగుతుందని అంటే లొకేషన్స్ చేంజ్ చేయాలనీ అనుకుంటోంది. మరి ఈ తరహా ఆలోచన ఆ జట్టుకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.