కరాటే గర్ల్ ని టచ్ చేస్తే ఇలానే ఉంటుంది.. పోలీస్ ని చితకొట్టింది!

Saturday, April 7th, 2018, 11:15:15 PM IST

కాలం మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమ్మాయిలంటే ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా అనుకువుగా ఉంటారు అనుకుంటే పొరపాటే. సహనం కోల్పోతే ఎవ్వరైనా ఎదురుతిరుగుతారు. అలానే ఒక యువతి కూడా భయపడే మహిళలకు స్ఫూర్తినిచ్చే విధంగా ప్రవర్తించింది. చేడుగా ప్రవర్తించిన వ్యక్తిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించింది. అతను పోలీస్ అవ్వడం మరొక ఆశ్చర్యకర విషయం. సాధారణంగా పోలీస్ అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. కానీ మహిళ ధాటికి ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు.

అసలు వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని రోహ్‌తక్‌లో 21 ఏళ్ల యువతి కరాటే క్లాస్ ఆటోలో ఇంటికి ముగించుకొని వెళుతోంది. అయితే యాసిన్ అనే కానిస్టేబుల్ అదే ఆటో ఎక్కాడు. ఆమెపై అసభ్య చూపులతో సైగ చేస్తూ.. ఫోన్ నంబర్ ఇవ్వాలని అడిగాడు. అంతే కాకుండా అసభ్యకరంగా తాకుతూ ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పడంతో యువతి తనకు తెలిసిన కరాటే విద్యను ప్రయోగించింది. అందరు చూస్తుండగానే నడి రోడ్డుపై చితక్కొట్టి అదే ఆటోలో మహిళా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లింది. అయితే అక్కడ పిర్యాదు చేయగా వాళ్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో విషయాన్ని యువతి ఉన్నతాధికారులకు తెలియజేయడంతో నిందితుడిపై చర్యలు తీసుకొని సస్పెండ్‌ చేశారు.