మెగా దెయ్యాలు – సోషల్ మీడియాలో వైరల్

Saturday, October 27th, 2018, 04:25:19 PM IST

సాధారణంగా దెయ్యాలు, చేతబడులు, బాణామతి లాంటి ఇతర తాంత్రిక శక్తులు అంటే భయపడని మనిషి ఉండదు. అదే సినిమా విషయానికి వస్తే హారర్ సినిమాలు ఎక్కువ క్యూరియాసిటీ తో చూస్తుంటాం, “హాలోవీన్ ” విదేశాల్లో బాగా పాపులర్ అయినా ఈ సాంప్రదాయం గ్లోబలైజేషన్ పుణ్యమా అని భారత దేశం లో కూడా విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇదొక విచిత్ర సాంప్రదాయం, నరమాంస భక్షకులు, రక్తం తాగే పిశాచులు, ప్రాణాలు తీసే రాక్షసులు లాంటి భయంకర రూపాల్లో మనుషులు అలంకరించుకోవడం ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.

సెలబ్రిటీ లు ఎక్కువగా ఈ సాంప్రదాయం ఫాలో అవుతుంటారు, తాజాగా మెగాస్టార్ కుటుంబ సభ్యులు ఈ హాలోవీన్ సెలెబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేసారు. ఈ సెలెబ్రేషన్స్ లో చిరంజీవి రాక్షస అవతారం లో కనిపించగా మిగతా కుటుంబ సభ్యులు అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శ్రీజ, సుస్మిత, నిహారిక, ఉపాసన లతో సహా ఇతర మెగా కుటుంబ సభ్యులు, పిల్లలూ భూతాలూ, దెయ్యాల వేషధారణతో సందడి చేసారు.

ఈ సందడి లో ముఖ్యంగా చిరంజీవి తో పాటు ఉపాసన ప్రధాన ఆకర్షణ గా నిలిచింది . ఉపాసన రక్త పిశాచి లా కనిపిస్తూ అత్త సురేఖ ని ఆట పట్టిస్తున్న ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. అయితే రాంచరణ్ స్వామి మాల లో ఉన్న కారణం చేత ఈ వేషధారణకు దూరంగా ఉన్నప్పటికి సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments