పిక్ టాక్‌ : మ‌హాన‌టితో న‌డిగ‌ర‌తిల‌గ‌మ్‌

Sunday, May 6th, 2018, 11:56:59 AM IST

మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ‌ను వెండితెర‌పై వీక్షించేందుకు ఇటు ఏపీ, తెలంగాణ‌తో పాటు, అటు త‌మిళ‌నాడులోనూ ప్రేక్ష‌కాభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. అంద‌రి ఆశ‌ల్ని నెర‌వేర్చి, ఆ కోరిక‌ను తీర్చేందుకు ఎట్ట‌కేల‌కు `మ‌హాన‌టి` వ‌చ్చేస్తోంది. అయితే ఈ సినిమా తెలుగులో మే 9న రిలీజ‌వుతుంటే, రెండ్రోజులు ఆల‌స్యంగా తంబీల ముందుకు వెళుతోంది.

తాజాగా న‌డిగ‌ర్ తిల‌గ‌మ్ జెమిని గ‌ణేష‌న్- మ‌హాన‌టి సావిత్రి ఏకాంత స‌మ‌యంలో ఎంత రొమాంటిక్‌గా ఉన్నారో ఆవిష్క‌రిస్తూ ఓ ఫోటోని రిలీజ్ చేశారు. ఈ ఫోటో రియ‌ల్లీ ఫెంటాస్టిక్‌. వైట్ అండ్ వైట్‌లో బుద్ధిమంతుడిలా క‌నిపిస్తున్నారు జెమిని గ‌ణేష‌న్‌. ఆ మెడ‌లో టై చూశారా? ఎంత పొట్టిగా ఉందో.. అబ్బ‌బ్బ మ‌రీ ఇంత బుద్ధిమంతుడా? అనేలా లేదూ? ఆ ప‌క్క‌నే పాత కాలం చుక్క‌ల బొట్టు చీర‌లో సావిత్రి ఎంతో హుందుగా క‌నిపిస్తున్నారు. కీర్తి, దుల్కార్ జంట ఎంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నారో..?

Comments