ఇట్స్ అఫిషియ‌ల్.. మ‌హేంద్ర‌ సింగ్ ధోనీ పై వేటు..!

Saturday, October 27th, 2018, 11:02:45 AM IST

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌ సింగ్ ధోనీ పై వేటు ప‌డింది. గ‌త కొంత‌కాలంగా ఫామ్ లేమితో స‌త‌మ‌తం అవుతున్న ధోనీని.. సెల‌క్ష‌న్ క‌మిటీ టీ20 నుండి త‌ప్పించింది. త్వ‌ర‌లో వెస్టీండీస్‌తో పాటు రాబోవు ఆస్ట్రేలియా సిరీస్‌లో కూడా ధోనీ స్థానంలో యువ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌ను సెల‌క్ష‌న్ క‌మెటీ ఎంపిక చేసింది. ఇక టీమ్ ఇండియా ఇప్ప‌టి వ‌ర‌కు 104 టీ20 మ్యాచ్‌లు ఆడ‌గా.. ధోనీ దాదాపు 90 మ్యాచులకు పైగానే పాల్గొన్నాడు. 127 స్ట్రైక్ రేట్‌తో 1487 ప‌రుగులు చేసిన ధోనీ మెరుపులు కొంత‌కాలంగా ఆగిపోయాయి.

ఇక మ్యాచ్ ఫినిషింగ్‌లో త‌న‌కు తానే సాటి అయిన ధోని ఇటీవ‌ల వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతూ జ‌ట్టుకు భార‌మ‌వుతున్నాడు. ధోనీలో ఒక‌ప్ప‌టి ప‌దును క‌న‌బ‌డ‌క‌పోవ‌డంతో అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందుతున్నారు. అయితే వ‌చ్చే ప్ర‌పంచ క‌ప్ వ‌ర‌కు ఆడాల‌ని భావిస్తున్న ధోనీకి ఈ వేటు పెద్ద షాకే అని క్రికెట్ విశ్లేష‌కు సైతం అభిప్రాయ ప‌డుతున్నారు. మ‌రి ఈ సెల‌క్ట‌ర్ల వేటుతో ధోనీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడ చూడాలి. ఇక విండీస్‌తో టీ20 మ్యాచ్‌ల‌కు కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతినివ్వ‌గా.. రోహిత్ శ‌ర్మ తాత్కాలిక కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.