ప్ర‌గ్యాజైస్వాల్ బాయ్‌ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

Sunday, September 18th, 2016, 03:31:10 PM IST

pragya-manoj
కంచెతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన భామ ప్ర‌గ్యాజైశ్వాల్‌. ఆ సినిమాలో ప్ర‌గ్యాని చూస్తే ఆమెకోస‌మే ఆ పాత్ర పుట్టిందేమో అనిపిస్తుంది. అంత బాగా ఒదిగిపోయి న‌టించింది. అందుకే ఇప్పుడు ఆమెని అవ‌కాశాలు వ‌రిస్తున్నాయి. మ‌రి కెరీర్ ప‌రంగా జోరుమీదున్న ప్రగ్యా ప్రేమ‌లో ప‌డిపోయిందా? ఏమో తెలియ‌డం లేదు కానీ… ఓ కుర్రాడు మాత్రం ప్ర‌గ్యా నా గాళ్‌ఫ్రెండ్ అనేశాడు. అది కూడా వేల మంది మ‌ధ్య‌. అలా ప్ర‌క‌టించిన కుర్రాడు ఎవ‌రో కాదు… మంచు మ‌నోజ్‌. నిన్న విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన `ఎమ్‌.బి.40` ఫంక్ష‌న్‌కి ప్ర‌గ్యా కూడా హాజ‌రైంది. అక్క‌డ ఆమెకి మాట్లాడే అవ‌కాశాన్ని కూడా ఇచ్చారు. `ఇప్పుడు నా గాళ్‌ఫ్రెండ్ ప్ర‌గ్యా మాట్లాడుతుంది` అని చెప్పేశాడు మ‌నోజ్‌. దీంతో ఒక్క‌సారిగా షాక్ అయ్యింది ప్ర‌గ్యా. న‌వ్వుతూనే మైక్ ప‌ట్టుకొని స్పీచ్ ఇర‌గ‌దీసింది. ప్ర‌స్తుతం మ‌నోజ్‌, ప్ర‌గ్యా క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. ఆ అనుబంధంతోనే అలా అనుంటాడు మ‌నోజ్‌. అన్న‌ట్టు మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌ని మాత్రం నా ప్రాణ స్నేహితుడు అని పరిచ‌యం చేశాడు మ‌నోజ్‌.