కండోమ్ ప్ర‌క‌ట‌న‌లో షాకిచ్చిన మెగానాయిక‌ (వ‌రుణ్‌తేజ్‌ నాయిక కావ్య త‌ప‌ర్‌)

Friday, April 6th, 2018, 07:28:13 PM IST

ఇంకా ఒక్క సినిమా అయినా రిలీజ్ కాలేదు. అప్పుడే ఈ అమ్మ‌డు చెల‌రేగిపోతున్న తీరు చూస్తుంటే ఊరూ వాడా ముక్కున వేలేసుకుంటోంది. ఏ న‌వ‌త‌రం నాయిక చేయ‌లేని సాహ‌సం చేసి చ‌ర్చ‌ల్లోకొచ్చింది. ఇంత‌కీ ఎవ‌రీ భామ‌? అంటే వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్న స్పేస్ మూవీలో క‌థానాయిక‌గా ఎంపికైన కావ్య త‌ప‌ర్‌. ఈ ముంబై భామ వేడెక్కించే కండోమ్ యాడ్‌లో క‌నిపించి షాకిచ్చింది.

ఈ ప్ర‌క‌ట‌నలో చీర‌క‌ట్టులో క‌నిపించిన భామ బ్యాక్‌లెస్ లో క్యాట్‌వాక్ చేస్తూ కుర్ర‌కారు గుండెల్ని ట‌చ్ చేసింది. టూమ‌చ్‌గా ఎక్స్‌పోజ్ చేయ‌క‌పోయినా, బికినీ లుక్ రివీల్ చేయ‌క‌పోయినా చీర‌లోనే శృంగారం ఒల‌క‌బోసింది. మొత్తానికి మెగా నాయిక .. చాలా ఎర్లీగానే ఇలా వేడి పెంచేయ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కొచ్చింది. మ‌రోవైపు ఈ భామ న‌టించిన క‌న్న‌డ మూవీ ఒక‌టి రిలీజ్‌కి రావాల్సి ఉంది. ఫైట్ మాష్ట‌ర్ విజ‌య‌న్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ స‌ర‌స‌న న‌టించింది. ఆ సినిమా రిలీజ్ కాక‌ముందే వ‌రుణ్‌తేజ్ – సంక‌ల్ప్ రెడ్డి ప్రాజెక్టుకు సంత‌కం చేసింది. ఇప్పుడిలా క‌ల‌క‌త్తా కండోమ్ యాడ్‌లో న‌టించి వేడెక్కిస్తోంది.