మెహ‌బూబా రిపోర్ట్‌: హిట్టా? ఫ‌్లాపా? ఇదిగో ఇదే టాక్!!

Wednesday, May 9th, 2018, 10:52:56 PM IST

రెండ్రోజులు ముందే `మెహబూబా` హిట్టా ఫట్టా? ఎలా చెప్ప‌గ‌లం? అందుకు ఓ మార్గం ఉంది. సినిమా రిలీజ్ ముంగిట హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్‌లో చిత్ర‌యూనిట్‌కి, బ‌య‌టివాళ్ల‌కు, జోన‌ర్‌ని బ‌ట్టి ఆ జోన‌ర్ ప్రేక్ష‌కుల‌కు సినిమాల ప్రివ్యూలు వేస్తుంటారు. అలాంటి చోటికి దొంగ‌లా చేరి కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ చేప‌డితే ముందే రిజ‌ల్ట్ ఏంటో తెలిసిపోతుంది. అస‌లు ఆ సినిమా చూసిన జ‌నం ఏం మాట్లాడుకున్నారో వినేయొచ్చు. అలాంటి ఆప‌రేష‌న్ ఒక‌టి చేస్తే తేలిన విష‌యం ఏమంటే.. ఈసారి పూరి ష్యూర్‌షాట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌బోతున్నాడు. టాలీవుడ్ హిస్ట‌రీలోనే ఇలాంటి ల‌వ్‌స్టోరీ వేరొక‌టి లేద‌ని, టెక్నిక‌ల్ గా ఇంత హై స్టాండార్డ్ మూవీ బార్డ‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో మ‌నోళ్లు ఎవ‌రూ తీయ‌లేద‌ని, ఇక తీయ‌లేర‌ని చెప్పుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అన్నం ఉడికిందో లేదో చెప్ప‌డానికి ఒక్క మెతుకు ప‌ట్టుకుంటే చాల‌దూ? ట‌్రైల‌ర్‌తోనే ఆ న‌మ్మ‌కాన్ని ఇచ్చిన పూరి చించి ఆరేసే ప్రేమ‌క‌థ‌తో ఈ సినిమా తీశాడ‌ని చెప్పుకుంటున్నారు. లేటెస్టుగా ఆకాష్ ఏజ్ కాలేజ్ కుర్రాళ్లంద‌రికీ ఈ సినిమా వేస్తే బోయ్స్ గాళ్స్ ఒక‌టే ఖుషీ అయిపోయారు. ల‌వ్‌స్టోరీ ఫెంటాస్టిక్ అంటూ కితాబిచ్చేశారు. ఈ టాక్ రావ‌డంతో పూరి చాలా సంతోషంగా ఉన్నాడ‌ట‌.

హేమంత్ మ‌ధుక‌ర్ అనే యంగ్ డైన‌మిక్ బోయ్‌ మాట్లాడుతూ … ఇప్పుడే సినిమా చూశాను. మెహ‌బూబా టెర్రిఫిక్ ల‌వ్‌స్టోరీతో తెర‌కెక్కించారు. ఆకాష్ బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌.. పూరి ఎంచుకున్న క‌థ అద్భుతం అంటూ కితాబిచ్చాడు. సందీప్ చౌతా సంగీతం అద్భుతంగా ఉంది.. అని పొగిడేశాడు. మొత్తం టీమ్‌కి థ‌మ్సప్ ఇచ్చి ఉత్సాహం నింపాడు. ఎవ‌రు ఏం చెప్పినా మే 11న 7.30కి ప్ర‌సాద్ లాబ్స్‌లో ప్రివ్యూ వీక్షించాక విమ‌ర్శ‌కులు అస‌లు సంగ‌తి తేల్చాల్సి ఉంటుంది. అటుపై జ‌నం ఫ్యాక్ట్స్ ఏంటో నిర్ణ‌యిస్తారు.

Comments