నల్లధనం పై ఉన్న ఏకాగ్రత అభివృద్ధిపై లేదు.. మోడీ కౌంటర్

Sunday, May 6th, 2018, 02:20:27 AM IST

కర్ణాటకలో ఎన్నికలం సమరం తార స్థాయికి చేరుకుంటోంది. ప్రచారంలో నేతలు మాటల తూటాలు వదులుతున్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా వ్యక్తిగతంగా కూడా కొందరు అధికార నేతలపై విమర్శలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వస్తే కర్ణాటక ఎలక్షన్స్ లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ఎన్నో ప్లాన్స్ వేస్తోంది. గ్రామస్థాయి నుంచి ముఖ్య పట్టణాల వరకు అన్ని ఏరియాల్లో ప్రచారాలని పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. అయితే రీసెంట్ గా మోడీ కూడా పార్టీ గెలుపు కోసం రంగంలోకి దిగారు.

ఏ మాత్రం సందేహించకుండా కాంగ్రెస్ ఇతర పార్టీలపై విమర్శలు చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. తుమకూరులో ఈ రోజు నిర్వహించిన ఓ బహిరంగసభకు వెళ్లిన మోడీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోపాలపై కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని కర్ణాటక అభివృదిలోకి రావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలని ప్రచారంలో ప్రజలకు తెలియజేశారు. కాంగ్రెస్ మరియు జేడీఎస్ పార్టీలు రెండూ కూడా తోడుదొంగలని విమర్శిస్తూ.. ప్రజలను మోసం చేయడానికే వారు ఎన్నికల్లో నిలబడ్డారని చెప్పారు. అదే విధంగా హేమావతి లాంటి గొప్ప నది ప్రవహిస్తున్నప్పటికీ ఇక్కడి వారికీ కనీసం తాగడానికి మంచి నీళ్లు లేవు. తాగునీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నల్లడబ్బు మీద ఉన్న ఏకాగ్రత వారికి అభివృద్ధి పై లేదన్నారు. అందుకే వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ని ఓడించి బీజేపీని గెలిపించాలని మోడీ సభలో మాట్లాడారు.