పాదయాత్రలో హామీలు.. అధికారంలో కోతలు.. జగన్‌పై నారా లోకేశ్ సెటైర్లు..!

Friday, August 23rd, 2019, 11:13:52 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. అయినా కూడా వైసీపీ, టీడీపీ మద్గ్య రోజూ మాటల యుద్ధం పెరిగిపోతూ ఉంది.

అయితే గత కొద్ది రోజుల నుంచి టీడీపీ యువనేత నారాలోకేశ్ వైసీపీ, జగన్‌లపై తన ట్విట్టర్ ద్వారా సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. అయితే తాజాగా మరో సారి వైసీపీ అధినేత సీఎం జగన్‌పై దిమ్మతిరిగే సెటైర్లు విసిరారు. పాదయాత్రలో అర్హులందరికీ సంక్షేమకార్యక్రమాలు, అధికారంలోకి వచ్చాకా ఆంక్షల పేరుతో కోతలు. జగన్ గారూ! సామాన్యుడికి ఏంటీ కష్టాలు? హామీల నుంచి పథకాలకు వచ్చేసరికే సగం మంది లబ్దిదారులను తీసేసారు. వాళ్ళనుంచి కూడా కొంతమందిని తీసేసే కుట్రతో రేషన్‌ కార్డులకు ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. అయితే పోనీ ఆ పనైనా సరైన ప్రణాళిక, అధికారుల పర్యవేక్షణతో చేస్తున్నారా అంటే అదీ లేదు. పిల్లలు, మహిళలు 20 రోజులుగా ఎన్ని అవస్థలు పడుతున్నారో కనిపిస్తుందా? మీ ప్రతి నిర్ణయమూ ప్రజలకు శాపంగా మారుతోంది. ఏర్పాట్లేవీ చేయకుండా రూల్స్ మార్చేసి ప్రజలను ఎందుకిలా శిక్షిస్తున్నారు? కనీసం ఇప్పటినుంచైనా కాస్తంత చిత్తశుద్ధితో ప్రజల గురించి ఆలోచించండి. వెంటనే నమోదు కేంద్రాలను పెంచి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి అంటూ ప్రభుత్వాన్ని నిలదీసారు.