క్రికెటర్ తో డేటింగ్ లో.. చైతు హీరోయిన్ ?

Friday, June 1st, 2018, 11:21:52 AM IST

సినిమా స్టార్స్ కు క్రికెటర్స్ కు మధ్య ప్రేమ వ్యవహారాలు ఈ రోజు కొత్తేమి కాదు. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ క్రికెటర్స్ తో ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్నారు .. మరికొందరు ప్రేమాయణాలు మాత్రమే నడిపిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా నాగ చైతన్య హీరోయిన్ నిది అగర్వాల్ కూడా ఓ క్రికెటర్ తో ఘాటు ప్రేమాయణం సాగిస్తుందన్న న్యూస్ ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిది అగర్వాల్ తో ప్రేమలో పడ్డ క్రికెటర్ ఎవరో తెలుసా .. ? టీమిండియా స్టార్ క్రికెటర్ కె ఎల్ రాహుల్.

ఐపీఎల్ 2018 లో కింగ్స్ 11 పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ ఆ జట్టులో బాగానే మెరిశాడు. ప్రస్తుతం ఐపీఎల్ ముగియడంతో నిధి, రాహుల్ కలిసి ముంబై వీధుల్లో చెట్టా పట్టాలు వేసుకుని తెగ తిరిగేస్తున్నారట. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న సవ్యసాచి చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. నిధి బాయ్ ఫ్రెండ్ రాహుల్ .. ఫిట్నెస్ ఛాలెంజ్ ని చైతూకు విసిరాడు .. ఆ ఛాలెంజ్ స్వీకరించిన చైతు జిమ్ లో కసరత్తులు మొదలు పెట్టాడు.