వైయ‌స్ బ‌యోపిక్‌లో కెవిపి పాత్ర‌లో?

Saturday, May 12th, 2018, 02:45:59 AM IST

వైయ‌స్ ఆత్మ కేవీపీ పాత్ర‌లో సీనియ‌ర్ న‌టుడు రావు ర‌మేష్ క‌నిపించ‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాచారం. వైయ‌స్సార్ ముఖ్య‌మంత్రి అయ్యాక ఆయ‌న‌ వెన‌క ఉండి క‌థ‌ నడిపించిన రాజ‌కీయ‌ మేధావిగా కేవీపీ పేరు మార్మోగింది. స‌మ‌స్య ఏద‌యినా చిటికెలో ప‌రిష్క‌రించిన న‌మ్మిన బంటుగా, తాంత్రికుడుగానూ ఆయ‌న పేరు చెబుతారు. అందుకే ఇప్పుడు వైయ‌స్ ఆత్మ కేవీపీ పాత్ర‌కు `యాత్ర‌` ద‌ర్శ‌కుడు మ‌హి.వి. రాఘ‌వ్ ఎంతో క‌స‌ర‌త్తు చేసి చివ‌రికి రావు ర‌మేష్‌ని ఎంపిక చేసుకున్నార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ పాత్రలో ప్ర‌కాష్‌రాజ్‌ నటించాల్సి ఉన్నా ఆయ‌న‌కు కుద‌ర‌లేద‌ట‌. విల‌క్ష‌ణ న‌టుడు గంప‌గుత్త‌గా కాల్షీట్లు ఇవ్వ‌లేని స‌న్నివేశంలో రావుర‌మేష్‌ని ఆ అదృష్టం కాస్తా వ‌రించిందిట‌. ఇక ఈ చిత్రంలో వైయ‌స్సార్ పాత్ర‌లో మ‌మ్ముట్టి, వైయ‌స్ జ‌గ‌న్ పాత్ర‌లో త‌మిళ‌హీరో సూర్య న‌టించ‌నున్నారు. సూర్య క‌థ విన్నా.. ఇంకా ఓకే చెప్పాల్సి ఉంద‌ని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments