సల్మాన్ దోషి.. జైలు శిక్ష తప్పేలా లేదు?

Thursday, April 5th, 2018, 12:19:50 PM IST


గత 20 ఏళ్ల క్రితం నుంచి సల్మాన్ ఖాన్ జింకలను వేటాడిన కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుపై రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ న్యాయస్థానం ఎన్ని సార్లు విచారణ చేపట్టినప్పటికీ ఫైనల్ తీర్పు రాలేదు. సల్మాన్ కోర్టుకు వెళ్లడం రావడం జరుగుతూనే ఉంది. అయితే ఈ రోజు న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఫైనల్ గా అతను దోషి అని చెప్పడంతో కేసు ఒక్కసారిగా ఓ కొలిక్కి వచ్చిమనట్టయ్యింది. 1999 లో జోధ్ పూర్ లో షూటింగ్ నిర్వహిస్తుండగా సల్మాన్ విహారయాత్ర అంటూ జింకలను వేటాడిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు సల్మాన్ కి ఆరేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అతనికి మూడేళ్ళ జైలు శిక్ష పడితే బెయిల్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. హమ్ సాథ్ సాథ్ హైన్ సినిమా షూటింగ్ నిర్వహిస్తుండగా ఏ ఘటన చోటు చేసుకుంది. వారితో పాటు సైఫ్ అలీ ఖాన్ – టబు – నీలిమ్ – సోనాలి బింద్రే కూడా ఘటన జరిగినప్పుడు ఉన్నారు. కోర్టు వారికి కూడా నోటీసులను అందించింది. అయితే వారికి ఎటువంటి సంబంధం లేదని నిర్దోషులుగా తేల్చింది. ఇకపోతే కేసు నమోదవ్వగానే అప్పట్లో సల్మాన్ వారం రోజులు జోధ్ పుర్ లో జైలు జీవితాన్ని గడిపాడు. ఆ తరువాత కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. ఇకపోతే రీసెంట్ గా.. అంటే మార్చ్ 28న కేసుకు సంబందించిన వాదనలు పూర్తయ్యాయి. ఇక మరికొన్నిం గంటల్లో శిక్షను ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో అభిమానులు ఆందోళనలకు దిగకుండా ముందు నుంచే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments