పిక్ టాక్‌ : కుంద‌న‌పు బొమ్మ ఈ న‌వ‌వ‌ధువు

Wednesday, May 9th, 2018, 01:52:33 AM IST

సోన‌మ్ కపూరి పెళ్లి ఎంతో లోప్రొఫైల్‌లో పూర్త‌యింది. ఈ మంగ‌ళ‌వారం ముంబై బాంద్రాలో జ‌రిగిన ఈ వివాహ వేడుక మొత్తం ఒకెత్తు అయితే, ఆ పెళ్లి మంట‌పంలో సోన‌మ్ క‌నిపించిన తీరు, అంత‌కుముందు మెహందీలో జ‌రిగిన సందడి ఇంకో ఎత్తు. ఇక పెళ్లి వేళ సోన‌మ్ రెడ్ క‌ల‌ర్ డిజైన‌ర్ వేర్‌లో మ‌తి చెడ‌గొట్టింది.

దివినుంచి దిగివ‌చ్చిన దేవ‌క‌న్య‌వా? లేక దేవేంద్రుడే పంపించిన రంభ‌వా? అంటూ యూత్ ఒక‌టే ఫిదా అయిపోయింది. సోన‌మ్ ధ‌రించిన అల్ట్రా మోడ్ర‌న్ డిజైన‌ర్ వేర్ ఎంతో ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకుంది. ఈ డిజైన్‌ పేరు అనూరాధా వాకిల్ రెడ్ లెహంగా. కాంబినేష‌న్ మ్యాచింగ్ రెడ్ క‌ల‌ర్ బ్లౌజ్‌.. ఈ డ్రెస్‌కి కాంబినేష‌న్ ఆభ‌ర‌ణాలు త‌ళ‌త‌ళ‌లాడిపోయాయి. ఇదిగో ఈ పిక్ ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది.

  •  
  •  
  •  
  •  

Comments