స్పైడర్ ఎఫెక్ట్ .. ఇది బస్టాండా లేక సినిమా హలా ?

Thursday, September 28th, 2017, 03:56:49 PM IST

సూపర్ స్టార్ మహేష్ అంటే తమకు ఎంత ఇష్టమో ఆ గ్రామా ప్రజలు చూపించారు .. పైగా అయన దత్తత తీసుకున్న గ్రామం కావడంతో ఊరంతా మహేష్ సినిమా గురించే అక్కడ చర్చంతా !! అంతే కాకుండా ఆ గ్రామంలోని బస్టాప్ లో స్పైడర్ పోస్టర్లతో నింపేశారు. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా .. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ? సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన ఊరుని మహేష్ దత్తత తీసుకుని పలు అభివృద్ధి పనులు చేయించాడు. ఆయనంటే అక్కడి ప్రజలకు ప్రత్యేక ప్రేమ. తాజాగా మహేష్ నటించిన స్పైడరా సినిమా విడుదల కావడంతో .. ఆ ఊరినిండా ఎక్కడ చుసిన స్పైడర్ పోస్టర్లే. ఇక బస్టాప్ లో అయితే .. మొత్తం వాటితోనే నింపేశారు. మహేష్ భార్య నమ్రత ఈ ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. అన్నట్టు ఈ బస్టాప్ ని ఈ మద్యే కట్టించారట !! ఇది బస్టాప్ లా కాకుండా సినిమా హాల్ లా ఉంది కదా !!

  •  
  •  
  •  
  •  

Comments